Rahul Gandhi on RSS ideology
* ఆర్ఎస్ఎస్ వైఖరిపై రాహుల్ గాంధీ విమర్శలు
ఆకేరు న్యూస్, డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతాలు, తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము చెప్పిన భావజాలమే నిజమని, తమ సిద్ధాంతమే తుది సత్యమని ఆర్ఎస్ఎస్ నిరంతరం వాదిస్తుందని.. అయితే వారు చెబుతున్నది నిజం కాదని తనకు స్పష్టంగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో వైవిధ్యం, విభిన్న ఆలోచనల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన రాహుల్ గాంధీ.. భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి భిన్నమైన ఆలోచనలు, సంస్కృతి, జీవన విధానాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి జీవిత అనుభవాలు, ఆలోచనా ధోరణి వేర్వేరుగా ఉంటాయని, అటువంటి వైవిధ్యాన్ని గౌరవించడమే నిజమైన ప్రజాస్వామ్యమని అభిప్రాయపడ్డారు.
* ‘వాస్తవాలను పరిగణనలోకి తీసుకోరు’
ప్రజల వ్యక్తిగత అనుభవాలు, సమాజంలోని వాస్తవ పరిస్థితులు మరియు బహుళ కోణాలను పరిగణనలోకి తీసుకోకుండా.. ఒకే రకమైన సిద్ధాంతాన్ని లేదా విషయాన్ని అందరిపై రుద్దడం సరికాదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని అంగీకరించకుండా, ఒకే అభిప్రాయాన్ని నిజమని నమ్మించేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
