* తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో..
* భద్రాచలంలో మునిగిన సీతమ్మ వారి నారచీరల ప్రాంతం
* 13 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నదులు, చెరువులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. దీంతోపాటు కొండ ప్రాంతాలలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా చాలా రహదారులు మూసుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో వర్షాల కారణంగా 42 చోట్ల రోడ్లు మూసివేయబడ్డాయి. నేటి నుంచి జులై 13 వరకు కొంకణ్(Konkan), గోవా (Goa), సెంట్రల్ మహారాష్ట్ర (Central Maharashtra), కోస్టల్ కర్ణాటక (Coastal Karnataka) లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) అంచనా వేసింది. అలాగే, గుజరాత్ (Gujarat), ఉత్తర కర్ణాటక (North Karnataka) లో జూలై 10 నుంచి 13 వరకు.. సౌరాష్ట్ర, కచ్తో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana) లో జూలై 12 వరకు, కేరళ (Kerala), మహీ (Mahi), దక్షిణ కర్ణాటక (South Karnataka) లో జూలై 12, 13 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం (Bhadrachalam) లో మునిగిన సీతమ్మ వారి నారచీరల ప్రాంతం నీట మునిగింది. దీంతో పర్యాటకులు వెనుదిరుగుతున్నారు.
————————