లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వే పై ప్రమాదానికి గురైనబస్సు
ఆకేరు న్యూస్ డెస్క్ :ఆగ్రా(Agra) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఉన్నావ్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు (Double decker Bus)ను పాల ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతిచెందారు (18 people died). బీహార్లోని సీతామర్హి నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు తెల్లవారుజామున పాల ట్యాంకర్ (Milk tanker) ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంతో ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టి ముందు వైపుకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు. పోలీసులు మృతుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
