Gachibowli Building Collapse
అకేరు న్యూస్ హైదరాబాద్: మాదాపూర్ అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై కూలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేవలం 50 గజాల స్థలంలోనే ఏడంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. నిర్మాణ సమయంలోనే భవనం కుప్పకూలడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. భవనం నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారా? 50 గజాల స్థలంలో ఇంత భారీ నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. భవనం కూలిన సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించాయా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు స్పందించి నిర్మాణ అనుమతులు, భవన నాణ్యతపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. చిన్న స్థలంలో భారీ నిర్మాణం.. నిబంధనలు పాటించకుండా నిర్మాణం.. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌కు ప్రమాదం.. మాదాపూర్ ఘటనతో అక్రమ నిర్మాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
