MLA Revuri Prakash Reddy distribute Smart Ration Cards Parkal
అకేరు న్యూస్ పరకాల: పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
పరకాల టౌన్తో పాటు పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర మండలాల పరిధిలోని అర్హులైన పేద కుటుంబాలకు ఈ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సదుపాయాలు అందడంతో పాటు, వివిధ సంక్షేమ పథకాలకు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
