MLA Naini Rajender Reddy SIR Phase 2 Congress
* SIR ఫేజ్-2పై కాంగ్రెస్కు నాయిని దిశానిర్దేశం.. ప్రతి ఓటును పకడ్బందీగా పరిశీలించాలి
అకేరు న్యూస్ హనుమకొండ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండో దశ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, అర్హత కలిగిన ప్రతి ఓటరుకు నష్టం జరగకుండా బూత్ స్థాయి నుంచే పకడ్బందీగా పనిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు.
హనుమకొండ డీసీసీ భవన్లో శనివారం SIR ఫేజ్-2పై బీఎల్ఏలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాల పరిశీలన, వివరాల సేకరణ, ఓటర్లతో సమన్వయం, సమస్యలను గుర్తించడం వంటి అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి డివిజన్లో బీఎల్ఏలతో పార్టీ నాయకులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. బీఎల్ఏలకే పూర్తి బాధ్యతను పరిమితం చేయకుండా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు బూత్ స్థాయి వరకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు.
SIR రెండో దశలో సమన్వయ లోపం లేదా నిర్లక్ష్యం జరిగితే అర్హత కలిగిన ఓటర్లకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రతి ఓటు కీలకమని, ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా నష్టపోకుండా బూత్ నుంచి డివిజన్ స్థాయి వరకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కుమార్తె డాక్టర్ శ్రీగోధర్రెడ్డి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా SIR రెండో దశకు సంబంధించిన అంశాలను వివరించారు. ఓటర్ల వివరాలు, చిరునామాలు, మార్పులు తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తూ సమస్యలను వెంటనే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రతి డివిజన్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని బీఎల్ఏలతో నిరంతరం సమావేశాలు నిర్వహించాలని నాయిని పేర్కొన్నారు. ఓటర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేయడంలో పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు.
కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ, SIR ఇన్చార్జీలు నాజిర్ అహ్మద్, పల్లి శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నాయిని వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
