Comrade Kalyan Radhika Sarathkumar
* శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి క్రేజీ అప్డేట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మల్టీ టాలెంటెడ్ నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్న ఈ సినిమా 1992 నాటి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతం నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన పీరియాడిక్ కథాంశంతో రూపుదిద్దుకుంటోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ‘సరస్వతమ్మ’ అనే కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
* బాలయ్య అభిమానిగా డిఫరెంట్ రోల్
విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రాధికా శరత్‌కుమార్ నుదుటిపై ‘జై బాలయ్య’ అని రాసి ఉన్న హెడ్‌బ్యాండ్‌ను ధరించి, ఎంతో సీరియస్ ఎక్స్ప్రెషన్తో కనిపిస్తున్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్, లుక్ చూస్తుంటే కథలో సరస్వతమ్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా 90ల నాటి నేపథ్యంలో ఒక మహిళా పాత్రను నందమూరి బాలకృష్ణ అభిమానిగా డిజైన్ చేయడం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
* నటీనటులు & సాంకేతిక వర్గం…
ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ నటులు షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
దర్శకత్వం- జానకిరామ్ మారెళ్ల
సమర్పణ- కోన వెంకట్
నిర్మాతలు- వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి
సంగీతం- విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ- సాయి శ్రీరామ్
ఎడిటింగ్- చోటా కె. ప్రసాద్
పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌కి తోడు పవర్ ఫుల్ యాక్షన్, లవ్, ఎమోషన్స్‌ను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
