Tamil Cinema Strike September 2026
* సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదలకు బ్రేక్
అకేరు న్యూస్,చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమా విడుదలలతో పాటు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ నిర్ణయానికి ప్రధాన కారణం థియేటర్-ఓటీటీ విండోపై నెలకొన్న వివాదమేనని సమాచారం. థియేటర్లలో విడుదలైన సినిమాలను 8 వారాల తర్వాతే ఓటీటీ ప్లాట్ఫామ్లలోకి తీసుకురావాలని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దికాలానికే ఓటీటీలోకి వస్తుండటంతో థియేటర్ల ఆదాయంపై ప్రభావం పడుతోందని యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ విడుదలకు కనీసం 8 వారాల గ్యాప్ ఉండేలా నిబంధనలు అమలు చేయాలని వారు కోరుతున్నారు.ఈ అంశంపై నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమస్య మరింత ముదిరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్లు నిలిచిపోతే తమిళ సినీ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.అయితే ఈ నిర్ణయం ఎంతకాలం కొనసాగుతుంది? 8 వారాల థియేటర్-ఓటీటీ విండోపై తుది పరిష్కారం ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరిశ్రమలోని ప్రధాన వర్గాల మధ్య చర్చలు జరిగితేనే ఈ సంక్షోభానికి పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
