Warangal Police Constable Clash
* బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీదాడి
అకేరు న్యూస్ వరంగల్: మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్నాడనే ఫిర్యాదుతో వెళ్లిన బీట్ కానిస్టేబుల్‌కు, బెటాలియన్ కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఉర్సుగుట్ట సమీపంలోని ఓ బార్లో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి బార్ వద్దకు చేరుకున్నారు.
బార్ వద్ద ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సంతోష్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. సంతోష్ రెడ్డి బెటాలియన్ కానిస్టేబుల్ చెంపపై కొట్టగా.. ప్రతిగా బెటాలియన్ కానిస్టేబుల్ కూడా సంతోష్ రెడ్డిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆగ్రహానికి గురైన సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇద్దరు పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారా? అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టిన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
