Jangaon Chain Snatching
* మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ
అకేరు న్యూస్ జనగామ: జనగామ పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.
మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును ఒక్కసారిగా లాక్కొని దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఊహించని ఘటనతో బాధిత మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
