Karkal Illegal Sand Auction
ఆకేరు న్యూస్,తొర్రూరు:
మండలంలోని కర్కాల గ్రామంలో అక్రమంగా ఇళ్ల వద్ద, పొలాల వద్ద నిల్వ ఉంచిన 224 ట్రిప్పుల ఇసుకను మండల తహసీల్దార్ గడిల శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేసి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బహిరంగ వేలం పాట వేయనున్నట్లు తెలిపారు. ఈ వేలం పాట ఈ నెల 27న (గురువారం) ఉదయం 11:30 గంటలకు కర్కాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
* వేలం పాట వివరాలు
27-08-2026, గురువారం ఉదయం 11:30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం, కర్కాలధరావతు రుసుము (EMD): వేలంలో పాల్గొనబోయే వారు వేలం ప్రారంభానికి గంట ముందు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను నేరుగా వెళ్లి పరిశీలించవచ్చు. అత్యధికంగా పాట పాడిన వారికి ఇసుకను కేటాయిస్తారు. వారు నిర్దేశిత మొత్తం లెక్క ప్రకారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసి చెల్లించిన తర్వాత మాత్రమే ఇసుకను అప్పగిస్తారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి, ఆసక్తి కలిగిన నివాసితులు మరియు కాంట్రాక్టర్లు ఈ బహిరంగ వేలంలో పాల్గొనాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
