Warangal Battalion Constable
* చితకబాదిన బీట్ కానిస్టేబుల్, స్థానికులు
ఆకేరు న్యూస్ ,వరంగల్: మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. బార్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో ప్రశ్నించడానికి వచ్చిన తోటి పోలీసుపైనే చేయిచేసుకోవడం కలకలం రేపింది .
వరంగల్ జిల్లా, ఉర్సు గుట్ట సమీపంలోని ఓ బార్ బార్లో విపరీతంగా మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ సృష్టించడంతో, భయపడిన బార్ సిబ్బంది వెంటనే 112 కు డయల్ చేశారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బార్లో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ను వెంటనే షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సంతోష్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి అతని చెంపపై కొట్టారు.
దీంతో బెటాలియన్ కానిస్టేబుల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తిరిగి బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు. పోలీసు అధికారిపైనే ఎదురుదాడికి దిగడంతో ఆగ్రహించిన స్థానికులు మరియు బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి కలిసి ఆ బెటాలియన్ కానిస్టేబుల్ను లాఠీలతో చితకబాదారు.
——–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
