Telangana Heavy Rain Alert
* 8 జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక
అకేరు న్యూస్ హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ పరిధితో పాటు పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టుల పరిసరాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
