Jangaon Congress Women Convener
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా కాంగ్రెస్ ‘మహిళా కన్వీనర్’గా జఫర్గడ్ మండలం తిమ్మంపేట కు చెందిన ఇల్లందుల బేబీ శ్రీనివాసుని నియమించినట్లు జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధనవంతి ప్రకటించారు.
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత బలోపేతానికి, పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంతో పాటు మహిళలను, పెద్ద ఎత్తున పార్టీతో అనుసంధానం చేసే లక్ష్యంతో, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, వివిధ సెల్స్, డిపార్ట్‌మెంట్స్‌కు ఆర్గనైజింగ్ కన్వీనర్లను జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ నియమించారు.
ఈ నియామకాల్లో భాగంగా, జఫర్ గడ్ మాజీ జడ్పీటీసీ, డీసీసీ జనరల్ సెక్రెటరీ ఇల్లందుల బేబీని, జిల్లా మహిళా కన్వీనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా బేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా, నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీని జనగామ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
తనకు ఈ కీలక బాధ్యత దక్కేందుకు ప్రత్యేకంగా సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు కడియం శ్రీహరికి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్యకి ధన్యవాదాలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
