CM Revanth Reddy
* అమెరికా పర్యటనకు బ్రేక్.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్
అకేరు న్యూస్ హైదరాబాద్: విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేపట్టామని, విద్య, క్రీడలు, పెట్టుబడుల రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. బ్రిటన్ పర్యటనకు అనుమతిచ్చి, అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి నిరాకరించారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
అమెరికా పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖకు పూర్తి వివరాలు అందించామని సీఎం తెలిపారు. విద్య, క్రీడలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలను స్పష్టంగా వివరించామని, పర్యటన ఉద్దేశాన్ని పూర్తిగా వెల్లడించామని చెప్పారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.
* గుజరాత్ సీఎంకు అనుమతి..
తెలంగాణ సీఎంకు ఎందుకు నిరాకరణ? అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ సీఎం అమెరికా, కెనడాలో పర్యటించేందుకు కేంద్రం అనుమతించిందని, తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా తాను వెళ్లాలనుకుంటే మాత్రం అనుమతి నిరాకరించిందని అన్నారు. తన పర్యటనలో విషయం లేదనుకుంటే బ్రిటన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
* నన్ను కాదు.. తెలంగాణ ప్రజలను అవమానించినట్టే
ప్రధాని మోదీ గుజరాత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను సహించేది లేదని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రం వికసిత్ భారత్ విజన్‌తో ముందుకెళ్తుంటే.. తెలంగాణ తెలంగాణ రైజింగ్ విజన్‌తో ముందుకు సాగుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తన పర్యటనను అడ్డుకోవచ్చేమో కానీ తన ఆలోచనలను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
విదేశీ పర్యటనలకు సంబంధించి ఎంబసీ అధికారులు సమన్వయం చేస్తారని, వారి నివేదికలు కేంద్రానికి వెళ్తాయని సీఎం పేర్కొన్నారు. ప్రధాని దృష్టికి వెళ్లకుండా ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధానాలను తెలంగాణవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.
* కొండా సురేఖ ఇష్యూ క్రమశిక్షణ పరిధిలో ఉంది
ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం స్పందించారు. అది పార్టీ అంతర్గత వ్యవహారమని, క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత అంశాలపై తాను మాట్లాడబోనని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
