PM Modi Vision India Progress
* బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు చూపుతో దేశం ప్రగతి బాటన సాగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ స్థాయి ఎస్ ఐ ఆర్ (SIR) రెండో విడత సమావేశం.
జిల్లా ఎస్ ఐ ఆర్ అభియాన్ కన్వీనర్ బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా బిజెపి అధ్యక్షులు సౌడ రమేష్ గారు మాట్లాడుతూ
ప్రధాని నరేంద్ర మోడీ ముందుచూపుతో దేశ పురోగతిలో భాగంగా భారతీయ పౌరులందరికీ సమానమైన ఓటుహక్కు కల్పించడానికి ప్రత్యేక ఓటరు సవరణ జాబితా దేశమంతా ఒకే విధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అక్రమాలకు తావు లేకుండా సరైన పద్ధతిలో దేశం గర్వించదగ్గ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మాదిరి జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎస్ ఐ ఆర్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వం వెలువడించిన జాబితా అంశాలను కూలంకషంగా పరిశీలించి బిజెపి బిఎల్ఎ లు ఓటర్ల వద్దకు వెళ్లి ఫారం 6 ద్వారా నూతన ఓటర్లకు అవకాశం కల్పించడం, ఫారం 7 ద్వారా డిలీషన్, ఫారం 8 ద్వారా షిఫ్టింగ్ పద్ధతులను అనుసరించి నిజమైన అర్హులకు ఓటు హక్కును కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. రేపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు ఫీజు రియంబర్మెంట్స్ కోసం స్టేట్ ఆఫీస్ వద్ద నిర్వహించే నిర్వహిస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ప్రతి కార్యకర్త హాజరు కావాలన్నారు.
సమావేశంలో రాష్ట్ర నాయకులు ఊడుగుల రమేష్, బల్ల శ్రీనివాస్, మండల అధ్యక్షులు సట్ల వెంకట రమణ, గంటే ఉపేందర్, పుప్పాల వేణు, బైరపాక కుమార్, అమరేందర్ రెడ్డి, దుర్గాప్రసాద్ సందీప్, జగదీష్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
