Revanth Reddy US Tour Controversy
* నా పర్యటనను కేంద్రం అడ్డుకుంది..
* గుజరాత్ సీఎంకు ఇస్తారు.. తెలంగాణకు ఇవ్వరా..
* ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ తీరు
* నన్ను అడ్డుకున్నా.. నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు..
* తెలంగాణ అభివృద్ధి బీజేపీ ఎంపీలకు అవసరం లేదా?
* కేంద్రం తీరుపై సీఎం రేవంత్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తన విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ పర్యటనను ముగించుకుని ఈరోజు హైదరాబాద్ చేరుకున్న ఆయన సచివాలయంలో సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశాల్లో ఉండగా స్పందిస్తే దేశద్రోహి అనేవారని, అందుకే ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నా అన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులతో కలిసి రేవంత్ మాట్లాడుతూ తన విదేశీ పర్యటనను కేంద్రం అడ్డుకుందని స్పష్టం చేశారు.
* రాష్ట్రాల కలయికతోనే ..
తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర అభివృద్ధికి తాము తోడ్పతుతున్నామని తెలిపారు. 2047 లక్ష్యంతో కేంద్రం పని చేస్తుందని అన్నారు. రాష్ట్రాల కలయికతోనే దేశం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. విద్య, క్రీడల్లో పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించామని అన్నారు. తెలంగాణ ఒక ప్రత్యేక కార్యచరణ తీసుకొని ముందుకెళ్తుందని తెలిపారు. అకారణంగా అమెరికా పర్యటన నిరాకరించారని అన్నారు. తన పర్యటనను తప్పుదోవ పట్టించేలా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
* గుజరాత్ కు ఇస్తారు కానీ.. తెలంగాణకు ఇవ్వరా ?
సీఎం పర్యటన దాపరికంగా ఉందన్నట్లు విదేశాంగశాఖ మాట్లాడిందని, తన పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం కేంద్రానికి ముందే ఇచ్చామని స్పష్టం చేశారు. రాజకీయ పరమైన నిర్ణయాలతో మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ తమకు రిప్లై ఇచ్చిందని అన్నారు. గుజరాత్ సీఎం కి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతిస్తారు కానీ తెలంగాణ సీఎం కి ఇవ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చే వరకు విదేశీ పర్యటన తిరస్కరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* యావత్ తెలంగాణ ఖండించాలి
ఇంగ్లాండ్, అమెరికా పర్యటనలకు ఒకే విధంగా అప్లై చేశామని, ఇంగ్లాండుకు అనుమతి ఇచ్చి, యుఎస్ కు తిరస్కరించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉండాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చెప్తున్నాను అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ఎంపీలకు అవసరం లేదా? అని ప్రశ్నించారు.
* మోదీ వద్ద బానిసలుగా బతుకుతారా
తెలంగాణ ఆత్మ గౌరవం తాకట్టుపెట్టి నరేంద్ర మోడీ దగ్గర కట్టు బానిసల్ల బతక దలుచుకున్నారా సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. ఇది తెలంగాణపై పూర్తి వివక్ష అన్నారు. దీనిపై రాజ్యసభలో మా అధ్యక్షుడు కర్గే ప్రశ్నిస్తారని తెలిపారు. స్పష్టమైన వివక్ష కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తుండడం ఏమాత్రం సహించరానిదని తెలిపారు.
* ఇది రేవంత్‌కు జరిగిన అవమానం కాదు..
తన విదేశీ పర్యటనను అడ్డుకోవడం కేవలం రేవంత్ కు జరిగిన అవమానం కాదని, తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు. నరేంద్ర మోడీ వైఖరిని అందరూ ఖండించాలని తెలంగాణ బిజెపి ఎంపీలకు సూచించారు. గుజరాత్ ను సపోర్ట్ చేస్తున్నారా.. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారా అనేది స్పష్టం చేయాలన్నారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు.
* నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు..
కేంద్రం నా పర్యటనను అడ్డుకోగలిగింది కానీ నా లక్ష్యాన్ని మాత్రం ఆపలేకపోయారని తెలిపారు. అధికారులను యుఎస్ కు పంపానని, ఆక్స్ పర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోబోతున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. విదేశాల్లో ఉండగా స్పందిస్తే దేశద్రోహి అనేవారని, అందుకే ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నా అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
