ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో (In the Lok Sabha elections) నూ ప్రాంతీయ పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏపీ సీఎం(AP CM), బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) కీలకంగా మారారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన చంద్రబాబు (Chandrababu).. మోదీ వద్ద తన డిమాండ్లను నెరవేర్చుకునే పనిలో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణం కోసం 1 ట్రిలియన్ రూపాయాలు కావాలని డిమాండ్ చేసినట్లు బ్లూమ్బర్గ్ (Bloomberg) అనే వెబ్సైట్ (Website) లో కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని మనేకా దోశి అనే జర్నలిస్టు (Maneka Doshi is a journalist) తన ట్వీట్టర్ వాల్పో పోస్టు (Twitter wal post) చేశారు. ఏపీకి 1 ట్రిలియన్ (1 Trillion)పాయాలు ఇవ్వాలని మోదీని ఆర్థిక మద్దతు కోరినట్లు ఆమె పేర్కొన్నారు. బ్లూమ్బర్గ్ నుంచి సోర్స్ అందినట్లు ఆమె తెలిపారు. జర్నలిస్ట్ మనేకా (journalist Maneka Doshi) ట్వీట్ (Tweet) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) కూడా స్పందించారు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పొచ్చో.. ఈ అంశం ద్వారా తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు వీటన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని కేటీఆర్ స్పష్టం చేశారు.
——————————-