Hyderabad Suicide Case
* 20 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు
* సెల్ఫీ వీడియోలో పలు ఆరోపణలు
* ఓ వ్యక్తి ఆత్మహత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ వర్గానికి చెందిన స్థల వివాదం.. ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరి అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకుని మృతి చెందాడు. మసీదు కమిటీ సభ్యుల వేధింపులే ఈ మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా తనను వేధింపులకు గురి చేశారని యాదిగిరి ఆ వీడియోలో పేర్కొన్నారు. తన ఆత్మహత్యకు కారణం మసీదు కమిటీ అని తెలిపారు. 20 ఏళ్లుగా తనకు నరకం చూపిస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* పోలీసుల కథనం.., సెల్ఫీవీడియో ప్రకారం..
హైదరాబాద్ ముషీరాబాద్ కి చెందిన డి యాదగిరి ముదిరాజ్ (54) వృత్తి రీత్యా వ్యాపారి. ఓ వర్గం కమిటీ కి చెందిన స్థలాన్ని కొన్ని సంవత్సరాల క్రితం లీజుకు తీసుకొని బుగ్గల వ్యాపారం చేసేవాడు. గత పది సంవత్సరాల క్రితం వ్యాపారం నిలిపివేసి మిగతా వ్యాపారాలు చేసుకుంటానని కమిటీ సభ్యులను అడిగారు. వారు నగదు డిమాండ్ చేయడంతో ఐదు లక్షల కూడా చెల్లించినట్లు తెలిపారు.
* 20 ఏళ్లుగా నరకం
గత 20 సంవత్సరాలుగా తనకు స్థలంలో ఎలాంటి వ్యాపారాలు చేసుకోకుండా కమిటీ సభ్యులు తరచూ వేధించడం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తనకు నరకం చూపిస్తున్నారని అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆ స్థలంలోనే ఉన్న గదిలో దూలానికి కాళ్లతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాచ్ మన్ చూసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేయడంతో వెంటనే వారు గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గాంధీ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ మార్చురీకి తరలించారు. ఓ వర్గానికి చెందిన కమిటీ సభ్యుల వేధింపుల వల్లే మా అన్న చనిపోయాడని మృతుని తమ్ముడు మురళీమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధీనగర్ సిఐ సిహెచ్ సురేష్ బాబు తెలిపారు.
* వీడియో మోదీ, అమిత్ షా.. రేవంత్ ల ప్రస్తావన
తన కుటుంబానికి న్యాయం చేయాలని సెల్ఫీ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి సార్.. నాకు చంగిచర్లలో వెయ్యి గజాల జాగా ఉంది. ఎవరినీ మోసం చేయలేదు. చనిపోయే ముందు అబద్దం ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఆ జాగాకు సంబంధించి డాక్యుమెంట్లను నా నాన్న, తమ్ముడు చూపిస్తారు. న్యాయం చేయండి. మేం పది మందికి పెట్టామే కానీ.. ఎవరినీ మోసం చేయలేదు.. అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
