Warangal CP Swetha
* అంతర్రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్
అకేరు న్యూస్, హన్మకొండ :హనుమకొండ జిల్లా దామెర మండలంలో పోలీసులు భారీ గంజాయి రాకెట్‌ను బట్టబయలు చేశారు. దామెర పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ముదిగొండ నాగేశ్వరరావు (55)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు నిందితుడి ఇంటిపై నిర్వహించిన సోదాల్లో 251 కిలోల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నాగేశ్వరరావు ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు తదితరులకు అధిక ధరకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి సమాచారంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడడమే లక్ష్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్, దామెర ఎస్సై వీరభద్రరావు, శాయంపేట ఎస్సై పరమేశ్వర్, పరకాల ఎస్సై రఘుపతి, ఏఏఓ సల్మాన్ పాషా, దామెర, శాయంపేట పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
