Sarampalli Mallareddy Death
* మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సీపీఎం కార్యాలయం ఎంబి భవన్ లో సారంపల్లి మల్లారెడ్డి భౌతిక కాయనికి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జీవితమే పోరాటంగా భావించి ప్రతిక్షణం వ్యవసాయరంగ అభివృద్ధికి పరితపించిన సారంపల్లి మల్లారెడ్డి నిబద్ధత కలిగిన రైతు ఉద్యమ నాయకుడని తెలిపారు. అఖిల భారత రైతు సంఘం, కమ్యూనిస్ట్ నేతగా రైతాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేసుకున్నారు. 1987లో రాజకీయాలలోకి వచ్చిన నాటి నుండి నా వెన్నంటే ఉంటూ నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన వారిలో అత్యంత ప్రథముడు సారంపల్లి మల్లారెడ్డి అని వెల్లడించారు. మల్లారెడ్డితో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నానని, అన్ని ఉద్యమాలకు మల్లారెడ్డి నన్ను కన్వీనర్ గా ముందు వరుసలో నిలిపి రాజకీయ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. మల్లారెడ్డి లాంటి గొప్ప ఉద్యమ నాయకున్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి మరణం భారత రైతాంగ ఉద్యమానికి, సీపీఎం పార్టీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని అభివర్ణించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
