Irrigation Projects Land Acquisition
* పెండింగ్ భూసేకరణ, ఆర్అండ్ఆర్ సమస్యలను పరిష్కరించాలి.
* జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ సమస్యలపై సమీక్షించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
ఆకేరు న్యూస్,ములుగు:
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాసం –పునరావాస పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్), అటవీ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ములుగు కలెక్టరేట్ (ఐడి ఓ సి) నుంచి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణను చీఫ్ ఇంజినీర్లు సవాల్‌గా తీసుకుని యుద్ధప్రాతిపదికన పనిచేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించిన టోకెన్లను త్వరితగతిన క్లియర్ చేయడంతో పాటు పెండింగ్ అవార్డులను వీలైనంత త్వరగా పాస్ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ల పీడీ ఖాతాలకు చేరిన నిధులు అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు పరిహారం అందించి భూమిని సకాలంలో సేకరించాలని మంత్రి సూచించారు.కలెక్టర్లు నీటిపారుదల శాఖ కార్యదర్శితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో
డి ఎఫ్ ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ కృష్ణవేణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
