Pasra Police Station Inspection
* శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి.
-ములుగు జిల్లా ఎస్పీ.
ఆకేరు న్యూస్,ములుగు: ములుగు జిల్లాలోని గోవిందారావు పేట మండలం పస్రా పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ మంగళవారం సందర్శించి పరిశీలించారు.పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవలందించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన వాహనాల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోగల రౌడీషీటర్లు సస్పెక్ట్ షీటర్ల కదలికలను గమనించాలని, అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలను జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి కిషోర్ కుమార్,పస్రా సీఐ దయాకర్ , ఎస్ఐ తాజుద్దీన్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
