Raksha Bandhan celebrations in Hanamkonda
* జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయికి రాఖీ కట్టిన బాలసదన్ బాలికలు
అకేరు న్యూస్ హన్మకొండ :హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
జిల్లా కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి కి సుబేదారిలోని బాలసదన్ బాలికలు రాఖీ కట్టారు.
రాఖీ పర్వదిన ప్రాముఖ్యతను జిల్లా కలెక్టర్ వివరిస్తూ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు, ఆప్యాయతకు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని వివరించారు. బాల సదన్ బాలికలకు రక్షణగా నిలబడాలని తెలిపారు.
ఈ వేడుకలలో బాలికలకు కలెక్టర్ రాఖీ కట్టారు. రక్షాబంధన్ రోజున తనకు రాఖీని కట్టిన బాలికలకు జిల్లా కలెక్టర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
రాఖి పర్వదిన సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి వేడుకలు జరుపుకోవడం పట్ల బాలికలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాల సదన్ సూపరింటెండెంట్ కళ్యాణి, బాల సదన్ బాలికలు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
