Chandrababu local body elections
* జగన్‌పై సంచలన ఆరోపణలు
అకేరు న్యూస్ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వేడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక చరిత్ర అని పేర్కొన్న సీఎం.. ఈ ప్రాజెక్టుతో ప్రజల చిరకాల కల నెరవేరుతోందని అన్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ప్రకటించామని తెలిపారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టుపైనా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు జలహారతి ఇస్తామని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రానికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మొత్తంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పోరును మరోసారి తెరపైకి తీసుకురాగా.. మరోవైపు వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరును స్పష్టం చేశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
