Eetham Palm Trees for Toddy Tappers
* ఈత తాటి చెట్లు నాటిన అధికారులు, ప్రజాప్రతినిది బృందం
ఆకేరు న్యూస్,ములుగు : ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో గీత కార్మికుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమాన్ని అందించే లక్ష్యంతో అటవీ శాఖ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఆర్డిఎ ఆధ్వర్యంలో శనివారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు హాజరై, అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ గీత కార్మికుల జీవనోపాధిని పెంపొందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈత, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ మొక్కలు భవిష్యత్తులో పెరిగి గీత కార్మికులకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ధీమా వ్యక్తంచేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాకులమర్రి ప్రదీప్ రావు, ఎండి వలీ బాబా, పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, నాయకులు సప్పిడి రాంనర్సయ్య,తురం పద్మ, ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, కార్యదర్శి జనార్ధన్, కన్నబోయిన రాజు యాదవ్, గౌడ సంఘం నాయకులు సప్పిడి రామ్ , కొండల్, రఘు, మొగిలి, పాలకుర్తి విజయ్, తాళ్ల పెళ్లి మోహన్, మెరుపు వెంకటేశ్వర్లు, సది, కొండాయి చిన్ని, అటవీ శాఖ అధికారులు, గౌడ సంఘ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
