Telugu Language and National Sports Day Celebrations
* కోడిశాల ఆశ్రమ పాఠశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
ఆకేరు న్యూస్, ములుగు:
మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల (కోడిశాల)లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మాతృభాషా తెలుగును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విద్యార్థులు తమ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. చదువుతో పాటు ఆటలు శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని, క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
