Suryapet Double Murder
* 25 ఏళ్ల పాత వివాదం చివరకు డబుల్ మర్డర్!
* సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో దారుణం..
* తండ్రి, ప్రత్యర్థిని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
అకేరు న్యూస్, సూర్యాపేట:
ఒక వేపచెట్టు కోసం మొదలైన వివాదం చివరకు రెండు ప్రాణాలను బలితీసుకుంది. 25 ఏళ్లుగా కొనసాగుతున్న వేపచెట్టు వివాదం మరోసారి భగ్గుమనడంతో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో భూక్య రాము అనే వ్యక్తి తన తండ్రి భూక్య సైదాతో పాటు ప్రత్యర్థి వర్గానికి చెందిన అమరబోయిన వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న మేళ్లచెరువు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మేళ్లచెరువు ఎస్సై నవీన్‌పై కూడా రాళ్లతో దాడి జరగడంతో ఆయన తలకు గాయమైంది. వెంటనే ఎస్సైని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనతో ఎర్రగట్టు తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 25 ఏళ్లుగా కొనసాగుతున్న వేపచెట్టు వివాదం ఇంతటి విషాదానికి ఎలా దారితీసింది? అసలు గొడవకు కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
