mla Danam Nagender Angry on Officials
* ఎమ్మెల్యే అంటే అధికారులకు గౌరవం లేకుండా పోయింది
* ప్రోటోకాల్ పాటించలేదంటూ అధికారులపై చిందులేసిన ఎమ్మెల్యే
అకేరు న్యూస్, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా కార్యక్రమంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకముందే అధికారులు లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రాక కోసం కొద్దిసేపు కూడా అధికారులు వేచి ఉండలేరా అంటూ ప్రశ్నించిన దానం నాగేందర్, ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే అధికారులకు గౌరవం లేకుండా పోయింది. అధికారులకు సిగ్గుండాలి. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగలేరా? అంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ న్యాయం జరగాలని దానం నాగేందర్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్లాట్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అర్హులైన వారికి ప్లాట్లు అందకపోతే తాను అధికారులను ప్రశ్నిస్తానని, అవసరమైతే వారి గల్లా పట్టి అయినా అర్హులకు న్యాయం జరిగేలా చూస్తానని తీవ్రంగా హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో పూర్తి పారదర్శకత ఉండాలని, పేదలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించడంతో పాటు ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని అధికారులకు దానం నాగేందర్ సూచించారు.
ఎమ్మెల్యే రాకముందే లక్కీ డ్రా నిర్వహించడంపై దానం నాగేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కార్యక్రమంలో చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
