Collector Chahat Bajpai, Hanamkonda Land Resurvey
* హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
* వివరాల డిజిటలైజేషన్ పరిశీలన
ఆకేరు న్యూస్, హనుమకొండ : భూ రీసర్వే వివరాలను పకడ్బందీగా డిజిటలైజేషన్ చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో భూములు కొలతలు శాఖ కార్యాలయంలో జిల్లాలోని 70 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే వివరాల నమోదును కలెక్టర్ పరిశీలించారు. రీసర్వేలో గ్రామ సరిహద్దు నిర్ధారణ, గ్రామకంఠం సరిహద్దులు, ప్రభుత్వ కాలువలు రోడ్లు శిఖం భూములు, ప్రభుత్వ ఆస్తులు, పాఠశాలలు, ఆసుపత్రులు, అసన్ చేసిన భూముల రీ సర్వే, పట్టాదారు భూముల రీ సర్వేను చేపట్టినట్లు భూములు, కొలతలు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐ సారంగపాణి కలెక్టర్కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… భూముల రీ సర్వే సమగ్ర వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్వేయర్లు స్టాలిన్, విజయ్, సుజాత తదితరులు ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
