Folk Dancer Eshwar Sai Madhuri Rathod Case
* అతడి కోసం పోలీసులు గాలింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్సర్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయిపై గత నెల 22న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు కాగానే ఈశ్వర్ సాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
తెలుగు జానపద పాటలు, సోషల్ మీడియా రీల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (‘బాసింగ బలాలే’, ‘ప్రమీల ఓ ప్రమీల’ ఫేమ్) వివాదంలో చిక్కుకున్నారు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో సహజీవనం చేసి శారీరకంగా వాడుకొని, ఇప్పుడు ముఖం చాటేశాడని మాధురి ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన తేగా బెదిరింపులకు దిగాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్/మార్ఫింగ్ వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో తన పరువు తీస్తూ డిజిటల్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై చీటింగ్, లైంగిక మోసం, బెదిరింపులు, ఐటీ యాక్ట్ (సైబర్ నేరాలు) కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక లాడ్జ్‌లో తోటి డ్యాన్సర్‌తో కలిసి ఈశ్వర్ సాయి ఉండగా, అతడి భార్య వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడే జరిగిన వాగ్వాదం, ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈశ్వర్ సాయి దంపతులకు ఒక బాబు ఉన్నాడు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
