Station Ghanpur MEO Kusuma Ramesh
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన కుసుమ రమేష్ ని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) బుధవారం సత్కరించింది.
ఈ సందర్భంగా లకావత్ చిరంజీవి మాట్లాడుతూ మండలంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను సరిచేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ, విద్యాశాఖ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా ? గుర్తింపు నిబంధనలు పాటిస్తున్నాయా? అనే అంశాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గుండె రంజిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
