Central Fertilizer App Telangana
* తప్పనున్న లైన్ల తిప్పలు
* యాప్‌లోనే యూరియా, డీఏపీ ఇతర ఎరువుల బుకింగ్..
* నేటి నుంచే సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ అందుబాటు
* కీలక మార్గదర్శకాలు విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతన్నలకు ఎరువుల కొరత లేకుండా పారదర్శకంగా పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో ఎరువుల విక్రయాల కోసం రూపొందించిన ‘సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప’ (ఎఫఎఫఎస్) నేûటి (గురువారం) నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ డిజిటల్ విధానం ద్వారా రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇంటి వద్ద నుంచే తమ మొబైల్ ద్వారా ఎరువులను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్ ద్వారా రైతులు యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. యాప్‌ను ఉపయోగించాలనుకునే ప్రతి రైతు ముందుగా తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రతి రైతుకూ ఒక ప్రత్యేకమైన ‘ఫార్మర్ ఐడీ’ కేటాయించబడుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల లబ్ధి పొందాలన్నా, ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఐడీ కలిగి ఉండడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నూతన విధానం వల్ల బ్లాక్ మార్కెటింగ్, ఎరువుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడటంతో పాటు రైతులకు సకాలంలో ఎరువులు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
