EMI Movie Darahas Shailaja
* ఈఎంఐ సినిమాతో ఎంట్రీ
* హీరోయిన్గా లిటిల్ హార్ట్స్ వండర్ కిడ్
* నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల పరిచయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లాల్‌సలామ్, హాస్టల్ డేస్ వంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న దరహాస్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఫేమ్ పొందిన శైలజా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో సక్సెస్ అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ను నిర్మిస్తోంది. నిఖిల్ కువ్వరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
* పూజా కార్యక్రమాలు పూర్తి
ఇ.ఎం.ఐ సినిమా పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.
* యువత, మధ్యతరగతి కుటుంబాలే కథాంశం
బైక్, కారు, ఫోన్ వంటి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఈఎంఐ చెల్లించడం సాధారణంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈఎంఐల భారం, వాటిని చెల్లించేందుకు యువత ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధాన కాన్సెప్ట్‌గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా కథను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలోని ప్రతి సన్నివేశం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందని పేర్కొన్నారు. సినిమాను పక్కా ప్లానింగ్‌తో నిర్మించడంతో పాటు భారీ స్థాయిలో ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
* రాహుల్ శ్రీనివాస్‌తో మరో భారీ చిత్రం
ఇ.ఎం.ఐ సినిమాతో పాటు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
* మంచి కాన్సెప్ట్స్‌తో వరుసగా సినిమాలు
మంచి కాన్సెప్ట్స్‌తో వరుసగా సినిమాలు నిర్మించేందుకు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇ.ఎం.ఐ చిత్రానికి దరహాస్, శైలజ నటిస్తుండగా.. సాయి మణీందర్ రెడ్డి సౌండ్ డిజైనర్‌గా, సనరే లిరిక్స్, మేఘన శేషవపురి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ప్రజ్నయ్ కొణిగారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మహీధర్ కూరపాటి క్రియేటివ్ డైరెక్టర్, శ్రీధర్ సొంపల్లి ఎడిటర్, ఫహాద్ అబ్దుల్ మజీద్ డీవోపీ, మాధవ్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని నిర్మాతలుగా, నిఖిల్ కువ్వరపు స్క్రిప్ట్, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కనెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ నిర్వహిస్తుండగా, గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్. మీడియా) పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
