Konda Surekha Dismissal Revanth Reddy
* కొండా దంపతులకు షాక్
* తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
* మంత్రి కొండా సురేఖపై వేటుకు సీఎం రేవంత్ నిర్ణయం
* కుడా చైర్ పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సూచిస్తూ సీఎం కార్యాలయం నుండి గవర్నర్‌కు అధికారిక లేఖ పంపించారు. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
* వరంగల్‌లో కార్యకర్తలతో సమావేశం
తమపై తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై స్పందించేందుకు కొండా సురేఖ ఇప్పటికే వరంగల్ పర్యటనకు వెళ్లారు. అక్కడ స్థానిక నాయకులు, అనుచరులు మరియు కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై తీవ్ర ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
పలు నామినేటెడ్ పోస్టుల రద్దు, కొత్త నియామకాలు
మంత్రివర్గంలో మార్పులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు కీలక నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది.
* జి. చిన్నారెడ్డి తొలగింపు
తెలంగాణ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేశారు. ఆయన స్థానంలో జిహెచఎంసి మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించారు.
* శారద నియామకం
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమిస్తూ సీఎం ఆమోదం తెలిపారు.
* కుడా చైర్ పర్సన్‌గా సుధారాణి
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని అపాయింట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకేసారి జరిగిన ఈ ముఖ్యమైన మార్పులు పదవుల భర్తీ అధికార కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
