Konda Surekha Dismissal Controversy
* కూతురికి టికెట్ అడిగితే తప్పేంటి?
* అధిష్ఠానానికి సురేఖ కౌంటర్
ఆకేరు న్యూస్, వరంగల్:
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. తనపై పార్టీ అధిష్ఠానం తీసుకున్న చర్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “నా బర్తరఫ్ ఏ రకంగానూ చెల్లదు” అని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా వివరణ (షోకాజ్ నోటీసు) తీసుకోకుండా తనను పదవి నుంచి ఎలా బర్తరఫ్ చేస్తారని అధిష్టానాన్ని నిలదీశారు. తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “కూతురు మాట్లాడిన మాటలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారు? ఆమెకు సొంత ఆలోచనలు ఉంటాయి. పదేళ్లుగా నా కూతురు పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. అది ఆమె రాజకీయ హక్కు” అని పేర్కొన్నారు. కడియం శ్రీహరి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. “కడియం శ్రీహరి తన కూతురు (కావ్య)కి ఎంపీ టికెట్ కోసం పట్టు పట్టలేదా? మరి నా కూతురు సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటో పార్టీ చెప్పాలి” అని నిలదీశారు.
అలాగే ఇతర పార్టీల నాయకుల బంధుత్వాలను ప్రస్తావిస్తూ.. “ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉంటే.. ఆయన తండ్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్లో లేరా? సంజయ్ కాంగ్రెస్లో లేరా? వేర్వేరు పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు లేని అభ్యంతరం, నా విషయంలోనే ఎందుకు వస్తోంది?” అని సురేఖ ప్రశ్నించారు. పార్టీలోని బీసీ నేతలపై వివక్ష చూపిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
