Station Ghanpur Congress Leaders
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : ప్రతిపక్షాల నేతలు కళ్లు లేని కబోధుల్లా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో రూ.1600 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, ఆర్ అండ్ బీ రోడ్లు మొదలైన అభివృద్ధి పనులు కనబడడం లేదా ? అని ప్రశ్నిస్తున్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ జంక్షన్ నుంచి గాంధీ చౌరస్తా, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ మీదుగా వివేకానంద సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లు పట్టించుకోని పాలకులు, కేంద్రంలో అధికారంలో ఉండి నయా పైస నియోజకవర్గ అభివృద్ధికి తేలేని వాళ్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు స్వయంగా పరిశీలించి ఆరోపణలు చేయాలి తప్ప నోటికొచ్చింది మాట్లాడడం సరి కాదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నీల రాజమ్మ గట్టయ్య, సంగీత రమేష్, హరినాథ్, సంపత్ రాజ్, పొన్న రవి, కృష్ణవేణి సారయ్య, రాజమ్మ రాజయ్య, నాయకులు బెల్లీదే వెంకన్న, జానీ పాషా, శ్రీనివాస్ రెడ్డి, సింగపురం దయాకర్, వక్కల రాజు, సింగపురం వెంకటయ్య, అక్కపల్లి శ్రీను, మేకల మల్లేశం, ఫాతికుమార్, నక్క పాపయ్య, గట్టు శివ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
