Ayyagaripalli Hidden Treasure Digging
* రాత్రికి రాత్రే తవ్వకాలు..
* విచారణ చేస్తున్న అధికారులు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో గుప్త నిధుల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలోని ఓ ప్రాంతంలో గుప్త నిధుల కోసం అజ్ఞాత వ్యక్తులు అర్ధరాత్రి తవ్వకాలు జరిపారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* హాట్ టాపిక్‌గా మారిన ఘటన
రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే దురాశతో కొందరు ముఠాగా ఏర్పడి ఈ తవ్వకాలకు ఒడిగట్టినట్లు స్థానికంగా వార్తలు వస్తున్నాయి. గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో లేదా పురాతన స్థలంలో ఈ తవ్వకాలు జరిగాయా ? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉదయాన్నే ఆ ప్రాంతంలో తవ్విన గుర్తులను గమనించిన గ్రామస్తుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
* వివరాలు సేకరిస్తున్న అధికారులు..
గుప్త నిధుల తవ్వకాల ప్రచారంపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామానికి చేరుకుని తవ్వకాలు జరిగిన స్థలాన్ని పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. అసలు అక్కడ తవ్వకాలు జరిపింది ఎవరు ? ఎంతమంది ఈ ఘటనలో పాల్గొన్నారు ? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
