Secunderabad - Kagaznagar Special Trains
* సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు..
* అన్ని జనరల్ బోగిలే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ మధ్య ప్రయాణించే వారికి గుడ్న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లలో పూర్తిగా అన్రిజర్వ్డ్ సాధారణ బోగీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైలు నంబర్ 07235 సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07236 కాగజ్నగర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా పలు ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం మార్గాల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులకు ఈ రైళ్లు మరింత సౌకర్యంగా ఉండనున్నాయి. పూర్తిగా జనరల్ బోగీలతో రైళ్లు నడపడం వల్ల రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారికి ప్రయోజనం కలగనుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు సికింద్రాబాద్-కాగజ్నగర్ మార్గంలో ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
