Warangal RDO T. Suma, Kondapur Land Resurvey
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని కొండాపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి, టి సుమ,వరంగల్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాయపర్తి తహసిల్దార్ ఎమ్.శ్రీనివాస్, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కొండాపూర్ గ్రామాన్ని రీసర్వే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం జరిగింది. రీసర్వే పూర్తయిన అనంతరం భూముల కొలతలు, విస్తీర్ణం, హద్దులు మరియు భూ రికార్డుల వివరాలు మరింత స్పష్టంగా, ఖచ్చితంగా నమోదు కావడంతో భవిష్యత్తులో భూములకు సంబంధించిన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఫీల్డ్‌లో సర్వే సిబ్బంది చేపడుతున్న భూముల కొలతలు, హద్దుల గుర్తింపు, భూ రికార్డులతో వివరాల అనుసంధానం తదితర అంశాలను RDO, పరిశీలించారు. రీసర్వే ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకత పాటిస్తూ, భూముల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వివరాలను నమోదు చేయాలని సర్వే సిబ్బందికి సూచించారు.
రైతులు తమ భూముల వద్ద సర్వే సమయంలో అందుబాటులో ఉండి, సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. తమ భూములకు సంబంధించిన పాత భూ రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు మరియు ఇతర సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రీసర్వే సమయంలో రైతులకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు లేదా భూములకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత రెవెన్యూ మరియు సర్వే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ రీసర్వే ప్రక్రియను సక్రమంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కొండాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు గ్రామ రైతులు, భూ యజమానులు మరియు గ్రామ పెద్దలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సంబంధిత గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
