Harish Rao Diversion Politics
* ప్రజా సమస్యలపై చర్చించండి : హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సభలో చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌ను పక్కనపెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
* ఆరు గ్యారెంటీల హామీ ఏమైంది?..
ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి బాండ్ పేపర్లు కూడా పంచారని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడిచినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని కోరారు. “ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాటిని ఆపి ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలి” అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
