Bank Holidays 2026
* వరుస సెలవులతో బ్యాంకింగ్ సేవలకు బ్రేక్..
* చెక్కులు, విత్డ్రాయల్స్పై తీవ్ర ప్రభావం
ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వరుసగా నాలుగు రోజుల పాటు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాలు శుక్రవారం ఒక రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి తోడు వరుసగా వీకెండ్ మరియు పండుగ సెలవులు రావడంతో సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు స్తంభించనున్నాయి.
* వరుస సెలవుల వివరాలు…
బ్యాంకు ఉద్యోగ సంఘాల (UFBU) ఆధ్వర్యంలో ఒక రోజు దేశవ్యాప్త సమ్మె. రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. ఆదివారం వారపు సెలవు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ మరియు బ్యాంకు సెలవు.
* స్తంభించనున్న ప్రధాన సేవలు..
వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు మూతపడనుండటంతో చెక్కుల క్లియరింగ్, నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, డిమాండ్ డ్రాఫ్ట్ల జారీ, శాఖల ద్వారా జరిగే విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు (Forex Transactions) నిలిచిపోనున్నాయి. పండుగ వాతావరణం నెలకొన్న వేళ వ్యాపారులు, సాధారణ ప్రజలు నగదు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.
శాఖల లావాదేవీలకు అంతరాయం కలిగినప్పటికీ, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు (ATMs), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు మరియు UPI (Google Pay, PhonePe, Paytm మొదలైనవి) సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. డిపాజిట్ మెషిన్ల ద్వారా నగదు జమ చేసుకోవచ్చని, అత్యవసర నగదు కోసం ఏటీఎంలను వినియోగించుకోవాలని సూచించారు. నగదు కొరత రాకుండా ఏటీఎంలలో తగినంత నగదు అందుబాటులో ఉంచేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
