ఇందారపు లాలయ్య
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తాడ్వాయి మండల అధ్యక్షుడిగా కాటాపూర్ గ్రామానికి చెందిన ఇందారపు లాలయ్య ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రెండ్ల సంతోష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యమంలో కీలక పాత్ర
2001లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇందారపు లాలయ్య అనేక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ సాధన కోసం కృషి చేశారని రెండ్ల సంతోష్ తెలిపారు. పలు గ్రామాల్లో యువతీ యువకులకు తెలంగాణ ఉద్యమంపై అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఉద్యమంలో లాలయ్య అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరినీ గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
తాడ్వాయి మండల అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఇందారపు లాలయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి సరైన న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు జినాకల లక్ష్మణరావు, పంచగిరి రమేష్, శ్యామ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

