HYDRAA Commissioner Ranganath Ganesh Immersion
* నిమజ్జనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు
* కమిషనర్ రంగనాథ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై హైడ్రా (HYDRAA) ఆంక్షలు విధించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. నగరంలోని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలకు తాము వ్యతిరేకం కాదని, ఈ విషయంలో ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన అమీన్పూర్ (బయోడైవర్సిటీ), కాప్రా (నేచురల్ వెట్‌ల్యాండ్) వంటి 4 నుండి 5 పర్యావరణ సున్నితమైన చెరువుల్లో మినహా.. మిగతా ఎక్కడా నిమజ్జనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఈ పర్యావరణ ప్రాంతాలను, పక్షుల ఆవాసాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని భక్తులు మట్టి విగ్రహాలను పూజించాలని ఆయన కోరారు. అదేవిధంగా POP (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాల నిమజ్జనం కోసం చెరువుల వద్ద ప్రత్యేకంగా బేబీ పాండ్స్ (కృత్రిమ గుంటలు) కేటాయిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
