TG-iPASS Approvals
* TG-iPASS దరఖాస్తులకు ఆమోదం
* T-PRIDE సబ్సిడీల మంజూరు
ఆకేరు న్యూస్, హన్మకొండ: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రోత్సాహం అందిస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గురువారం కుడా కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (DIPC), టీజీ-ఐపాస్ (TG-iPASS) కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, వివిధ శాఖల అనుమతులు, పెండింగ్ దరఖాస్తులపై కమిటీ చర్చించింది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులను అధికారులు ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
టీజీ-ఐపాస్ కింద వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న పలు పారిశ్రామిక యూనిట్లకు ఆమోదం తెలిపింది.

* ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
టి-ప్రైడ్ (T-PRIDE) పథకం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు సరకు రవాణా వాహనాల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్న ప్రోత్సాహకాలపై కూడా సమీక్ష జరిగింది. కమర్షియల్ టాక్స్ శాఖ స్క్రూటినీ పూర్తయి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు సబ్సిడీ ప్రోత్సాహకాలను కమిటీ మంజూరు చేసింది.
సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా రవాణా అధికారి జనార్దన్ రెడ్డి, ఎల్డీఎం విష్ణుప్రియతో పాటు కమర్షియల్ టాక్స్, ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, ఎస్సీ కార్పొరేషన్, కుడా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఫ్యాక్టరీలు, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు, డీఐసీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
