SBI Bank Robbery Nagpur
* కారం చల్లి క్యాష్ లూటీ
* అరగంటలో అరెస్ట్
ఆకేరు న్యూస్, డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ భండే ప్లాట్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకులో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు సిబ్బందిపై కారంపొడి చల్లి రూ.4.53 లక్షల నగదుతో ఓ యువకుడు పరారయ్యాడు. అయితే పోలీసులు కేవలం అరగంటలోనే నిందితుడిని అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
* ఏం జరిగిందంటే
గురువారం సాయంత్రం బ్యాంకు సిబ్బంది సీడీఎం నుంచి నగదు తీసుకుని లోపలికి వెళ్తుండగా సూరజ్ బోర్కర్ (28) అనే యువకుడు ఒక్కసారిగా బ్యాంకులోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న కారంపొడిని సిబ్బంది ముఖాలపై చల్లడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు రూ.4.53 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు.
* పోలీసుల స్పందన
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బీట్ మార్షల్స్, సక్కర్దర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి దోపిడీ జరిగిన అరగంటలోనే సూరజ్ బోర్కర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న మొత్తం రూ.4.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లుతున్న దృశ్యాలు సిసిటీవి (CCTV) కెమెరాలో రికార్డవ్వగా, ఈ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వైరల్‌గా మారాయి. చాకచక్యంగా దొంగను పట్టుకున్న పోలీసులను స్థానికులు, బ్యాంక్ యజమాన్యం అభినందించాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
