Bipasha Basu Protein Powder
* వైరల్ అవుతున్న ఫిర్యాదు
ఆకేరు న్యూస్, ముంబై : బాలీవుడ్ నటి బిపాషా బసు చేసిన ఓ ఫిర్యాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఉపయోగిస్తున్న ప్రొటీన్ పౌడర్‌లో చిన్న చిన్న పురుగులు కనిపించాయని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన బిపాషా.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారుల జోక్యాన్ని కోరారు.
* ఎఫ్‌డీఏ కమిషనర్‌కు ట్యాగ్
ఈ ఘటనపై బిపాషా బసు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముంఢేను ట్యాగ్ చేస్తూ సహాయం కోరారు. వినియోగదారులు కొనుగోలు చేసే ఆహార, న్యూట్రిషన్ ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై అధికారులు దృష్టి సారించాలని ఆమె కోరారు.
* సోషల్ మీడియాలో చర్చ
బిపాషా చేసిన ఆరోపణలతో ప్రొటీన్, న్యూట్రిషన్ సప్లిమెంట్ల నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. అయితే అధికారిక విచారణ పూర్తయ్యే వరకు ఆ ఉత్పత్తి కలుషితమైందని తుది నిర్ణయానికి రావడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
