Warangal Police Station Fire
* పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి
* ఇద్దరు పోలీసులకు గాయాలు
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. కుటుంబ వివాదంతో మనస్తాపానికి గురైన కట్ల హర్షిత్ అనే యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసుల ముందే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
* మంటలు ఆర్పే క్రమంలో పోలీసుకు గాయాలు
కుటుంబ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన హర్షిత్.. ఒక్కసారిగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టేషన్ రైటర్ ప్రవీణ్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం.
* ఇద్దరికీ ఎంజీఎంలో చికిత్స
గాయపడిన హర్షిత్‌తో పాటు రైటర్ ప్రవీణ్‌ను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* భార్య, అత్త వేధింపుల ఆరోపణలు
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. తన భార్య, అత్త వేధింపులతోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు హర్షిత్ ఆరోపించినట్లు తెలుస్తోంది. తన బిడ్డను తనకు దూరం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
* కారణాలపై పోలీసుల దర్యాప్తు
పోలీస్ స్టేషన్లోనే యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, కుటుంబ వివాదానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
