Sigma Movie Rage Song
* అదిరిపోయే మ్యూజిక్
* అక్టోబర్ 2న సిగ్మా మూవీ విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ పాటలకు మంచి స్పందన లభించగా.. తాజాగా ‘రేజ్ ఆఫ్ సిగ్మా’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
* తమన్ మ్యూజిక్.. సీన్ రోనాల్డ్ వోకల్స్
‘రేజ్ ఆఫ్ సిగ్మా’ పాటకు తమన్ అందించిన పవర్ఫుల్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీన్ రోనాల్డ్ ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత జోష్ తీసుకొచ్చాయి. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోందని చిత్రబృందం తెలిపింది.
* భారీ తారాగణం
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా.. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరిహరసుధన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.
* అక్టోబర్ 2న థియేటర్లలోకి
విభిన్నమైన పాటలతో ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తున్న ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ కిషన్‌ను కొత్త లుక్‌లో చూపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
