TVK Bypoll Candidates
* ధరాపురం బరిలో సత్యబాబా
* అక్టోబర్ 6న అసెంబ్లీ ఉప ఎన్నికలు
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. మదురాంతకం నియోజకవర్గం నుంచి కె. మరగతం కుమారవేల్, ధరాపురం నుంచి పి . సత్యభామ పోటీ చేయనున్నారు. ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
* ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే
కుమారవేల్, సత్యభామ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థులుగా పోటీ చేసి తమ నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
* టీవీకేకు కీలక పరీక్ష
ఈ ఉప ఎన్నికలు టీవీకే ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. రెండు స్థానాల్లోనూ గెలిస్తే పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది.
* బరిలో ఏఐఏడీఎంకే
తమ మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో కోల్పోయిన స్థానాలను తిరిగి దక్కించుకోవాలని ఏఐఏడీఎంకే ప్రయత్నించనుంది. దీంతో టీవీకే, ఏఐఏడీఎంకే మధ్య పోటీపై ఆసక్తి నెలకొంది.
* డీఎంకే కూడా పోటీలో
మదురాంతకం, ధరాపురం నియోజకవర్గాల్లో డీఎంకే కూడా కీలక పోటీదారుగా ఉండే అవకాశం ఉంది. 2026 ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఏఐఏడీఎంకే విజయం సాధించగా, టీవీకే, డీఎంకే ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
* కూటమి బలానికి పరీక్ష
టీవీకే కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీల మద్దతుతో ఈ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. దీంతో కొత్తగా ఏర్పడిన కూటమి బలానికి కూడా ఈ ఉప ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
